VSP: పేద, మధ్యతరగతి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజి-లక్ష్మి’ పథకాన్ని విశాఖ నగరంలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ పరిధిలో తొలి దశలో 800 మంది మహిళలు దరఖాస్తు చేశారు. ఈ పథకం ద్వారా నగరంలో సుమారు 600 డిజి-లక్ష్మి కియోస్క్‌లు ఏర్పాటు చేసి 250 రకాల డిజిటల్ సేవలను అందించనున్నారు.