WGL: పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన అల్లాడి రమేష్ ఫిర్యాదు మేరకు కుల బహిష్కరణ, డబ్బుల వసూళ్ల కేసులో నేడు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. బాధితుడి వద్దనుంచి రూ. 50 వేల డిపాజిట్ పెట్టించి, అట్టిడబ్బులు దుర్వినియోగం చేసి దుర్భాషలాడుతూ బెదిరించడంతో వారిపై కేసునమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.