అన్నమయ్య: చెరుకూరి లెనిన్–వోల్గా మెమోరియల్ NTPC ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య(ఆర్చరీ) ఛాంపియన్షిప్కు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ పోటీలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరుగనున్నాయి.