MHBD: తొర్రూరు మండలంలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు. గ్రామాల అభివృద్ధి, భద్రత కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.