MBNR: దేశవ్యాప్త జనగణనలో మొదటి విడత నుంచే బీసీ (OBC) కుటుంబాలను చేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీల గణనను కూడా చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.