MDK: టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్కు గురై రామావత్ మోత్య (55) మరణించారు. షాబాద్ తండాకు చెందిన ఆయన.. తన వ్యవసాయ క్షేత్రంలోని బోరు స్టార్టర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.