VKB: తాండూర్ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గళమెత్తారు. రోడ్లు అద్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. స్వల్ప వర్షానికే బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో అవి కోతకు గురవుతున్నాయని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకెళ్లారు.