AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాకట మీదుగా ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.