SRPT: మునగాల మండల కేంద్రంలోని పెనుయేలు చర్చిలో ఈస్టర్ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని ఆర్చ్ బిషప్ డాక్టర్ జె. సుదర్శనం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోకరక్షకుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు.