ADB: రైతు భరోసా నిధులను రైతులు డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల పంపిణీలో బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.