ELR: కన్నాపురంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వుందుర్తి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఏలూరుకు చెందిన వైద్యులు సేవలు అందించనున్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ విభాగాల్లో ఉచిత పరీక్షలు నిర్వహించి, ఔషధాలు అందజేస్తారు.