AP: రాజ్యసభలో రాజమండ్రి కల్తీ పాల ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. ఏపీలో కల్తీ పాలతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల కల్తీని అరికట్టేందుకు FSAI క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కోరారు. కల్తీ పాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. లాలాపేటలో 16 మంది చనిపోవడం బాధాకరమని వెల్లడించారు.