NLR: బుచ్చి నూతన సీఐగా మాతంగి శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తుళ్లూరు టూ టౌన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. శాంతిభద్రతలు మెరుగయ్యేలా తన వంతు కృషి చేస్తానని నూతన సీఐ తెలిపారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.