KDP: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య సూచించారు. మండల పరిధిలోని అనిమెల గ్రామంలో శుక్రవారం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సైబర్ నేరాలకు గురికావాల్సి ఉందన్నారు. ఓటీపీలు ఎవరికి చెప్పరాదన్నారు. అనంతరం మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు.