• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్

ప్రకాశం: కొండపిలో సోమవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని పీ.ఎస్.సీ.ఎస్ ఛైర్మన్ రఘునాథ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తుందని రఘునాథ బాబు అన్నారు. బయట మార్కెట్ కన్నా రూ.1000 అదనంగా పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

March 9, 2026 / 02:00 PM IST

రేపు నకరికల్లులో విద్యుత్ సరఫరా నిలిపివేత

PLD: నకరికల్లులో హుస్సేన్ హాస్పిటల్ మెయిన్ రోడ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జి. సుచరిత తెలిపారు. గాజులగడ్డ, యాసం బజారు, ఎన్టీఆర్ బొమ్మ నుంచి కోట్ల బజారు వరకు సర్వీస్ రోడ్ ప్రాంతంలో సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.

March 9, 2026 / 02:00 PM IST

పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం ప్రారంభం

GNTR: పెదవడ్లపూడి గ్రామంలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకాన్ని రిబ్బన్ కట్ చేసి, స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

March 9, 2026 / 02:00 PM IST

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే, భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

March 9, 2026 / 01:57 PM IST

నువ్వుల లడ్డూతో బోలెడు ప్రయోజనాలు

నువ్వులు, బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక లడ్డూ తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

March 9, 2026 / 01:55 PM IST

నాటు తుపాకీ కాల్పులతోనే బాలుడు మృతి?

AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో అనుమానదస్పదంగా మరణించిన కౌశిక్ నాటు తుపాకీ కాల్పులతో చనిపోయాడని వాదన బలంగా వినిపిస్తుంది. గ్రామానికి చెందిన వ్యక్తి అడవిలోకి వెళ్లి నాటు తుపాకితో వేటాడే అలవాటు ఉంది. ఆ వ్యక్తి కుమారుడు, కౌశిక్ ఇంట్లో ఉన్న నాటు తుపాకితో ఆడుకుంటున్న క్రమంలో తుపాకీ పేలి కౌశిక్ మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

March 9, 2026 / 01:54 PM IST

BREAKING: కేంద్ర మాజీమంత్రికి తీవ్ర అస్వస్థత

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు తీవ్ర అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వంలో కావూరి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఏపీలోని మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా, సాంబశివరావు ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 9, 2026 / 01:53 PM IST

ఆడపిల్లల సంరక్షణపై గ్రామాల్లో ప్రచారం

MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఐసీడీఎస్ మహబూబ్‌నగర్ విభాగం ఆధ్వర్యంలో ఆడపిల్లల సంరక్షణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, చట్టాలపై తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాల నివారణలో తల్లిదండ్రుల పాత్రను తెలిపారు. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతను గోడపత్రాల ద్వారా వివరించారు.

March 9, 2026 / 01:52 PM IST

ఉత్తమ మహిళా పురస్కారం అందుకున్న జిల్లా వాసి

విజయనగరానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఉత్తమ మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన వేడుకలలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఉపాధ్యాయ రంగంలో గడిచిన 23 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను గుర్తించి ఆమెకు ఈ పురస్కారం అందజేశారు.

March 9, 2026 / 01:50 PM IST

‘గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్పు.. సరైంది కాదు’

KMM: రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సవరణలు వ్యతిరేకిస్తూ సోమవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.

March 9, 2026 / 01:50 PM IST

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా

ATP: పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తి CPM పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.

March 9, 2026 / 01:50 PM IST

ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన మల్లారెడ్డి

PDPL: ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన బోధన, పరిశోధన రంగాల్లో సేవలు అందిస్తున్నారు.

March 9, 2026 / 01:48 PM IST

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

JN: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మైలారం గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం, CC రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 9, 2026 / 01:45 PM IST

HYDలో మొదటి డాల్బీ సినిమా థియేటర్

హైదరాబాద్ ప్రేక్షకులకు సరికొత్త దృశ్యకావ్య అనుభూతిని అందించేందుకు కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ సిద్ధమైంది. నగరంలోనే మొదటి డాల్బీ సినిమా (Dolby Cinema) థియేటర్‌ను ఇక్కడ అధికారికంగా ప్రారంభించనున్నారు. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

March 9, 2026 / 01:45 PM IST

మున్సిపాలిటీలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్

KMM: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మధిరలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఛైర్‌పర్సన్ సామినేని సుజాత పర్యవేక్షణలో 1, 4, 8, 12, 22వ వార్డుల్లో కౌన్సిలర్లు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

March 9, 2026 / 01:44 PM IST