విజయనగరానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఉత్తమ మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో జరిగిన వేడుకలలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఉపాధ్యాయ రంగంలో గడిచిన 23 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను గుర్తించి ఆమెకు ఈ పురస్కారం అందజేశారు.