TG: అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రభుత్వం బయట విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం తగదని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పీఆర్సీ కమిషన్ గడువు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన మెమోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏ నిర్ణయమైనా సభలోనే ప్రకటించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. నిబంధనలను అతిక్రమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు.