TG: తాను గతంలో కాంగ్రెస్కు ఎంతో సేవ చేశానని, మంత్రిగా పనిచేశానని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. ‘నాకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ పట్ల విధేయతతోనే ఉన్నాను. నాపై 5 సీబీఐ కేసులు పెట్టినా భయపడలేదు’ అని స్పష్టం చేశారు. నీళ్ల సమస్యపై ప్రజల పక్షాన మాట్లాడితే అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీతక్క ఎందుకు అంతలా విమర్శిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.