PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డును పాత విధానంలో నిర్వహించాలని గుర్తింపు కార్మిక సంఘం AITUC GS రాజ్ కుమార్ కోరారు. రామగుండం సింగరేణి సంస్థ RG-3 పరిధిలోని అన్ని గనులపై బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలన్నారు. విజిలెన్స్ కేసులను త్వరగా విచారించాలన్నారు.