E.G: రాజమండ్రిలో చేపట్టనున్న భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరిగా పొందాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గాదాలమ్మ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో భవన ప్లాన్లను కమిషనర్ పరిశీలించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.