TG: హైడ్రా పనితీరును KTR తప్పుబట్టారు. ‘హైడ్రా పెద్దలకు చుట్టంగా మారింది.. CM తమ్ముడి ఇంటికి దారి దొరకడం లేదా?’ అని ఎద్దేవా చేశారు. L&T సంస్థకు ఉన్న రూ.15 వేల కోట్ల అప్పును ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. మెట్రోకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ప్రభుత్వం కన్ను పడిందని, అందుకే ఇదంతా చేస్తున్నారన్నారు. నాడు సక్రమం అన్న భూములు నేడు అక్రమం ఎలా అయ్యాయని ప్రశ్నించారు.