TG: హైడ్రాకు చుట్టాలు ఎవరూ లేరని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని 6 ప్రధాన చెరువులను హైడ్రా కబ్జాల నుంచి కాపాడిందని తెలిపారు. చట్టబద్ధంగా ఇళ్లు నిర్మించుకున్న వారు అస్సలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నాలాలు, చెరువులను రక్షించి నగరాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.