AP: మాజీమంత్రి జోగి రమేష్‌పై మరో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించారు. YCP నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత నెలలో ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు మరువకముందే, మళ్లీ ఇప్పుడు కేసు పెట్టడం రాజకీయ కక్షసాధింపేనని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.