TG: సింగపూర్ ఐకానిక్ సిటీగా మారడానికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలే కారణమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. తరచూ విదేశాలకు వెళ్లే KTRకు ఈ విషయాలు తెలియనివి కావని ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం హైడ్రా తీసుకుంటున్న చర్యలను తప్పు పట్టడంలో అర్థం లేదన్నారు. నగరం బాగుపడాలంటే సాహసోపేత నిర్ణయాలు అవసరమని, మూసీ అభివృద్ధిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని కోరారు.