TG: మిషన్ భగీరథకు, వేసవి నీటి అవసరాలకు నిధులు ఇవ్వాలని MLA సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదని, KCR సర్కార్ మంజూరు చేసిన పనులను కూడా రద్దు చేశారని మండిపడ్డారు. మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు ఇస్తూ, ఇతర ప్రాంతాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.