VZM: బొబ్బిలి పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే, భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.