PDPL: ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డికి ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన బోధన, పరిశోధన రంగాల్లో సేవలు అందిస్తున్నారు.