PLD: నకరికల్లులో హుస్సేన్ హాస్పిటల్ మెయిన్ రోడ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జి. సుచరిత తెలిపారు. గాజులగడ్డ, యాసం బజారు, ఎన్టీఆర్ బొమ్మ నుంచి కోట్ల బజారు వరకు సర్వీస్ రోడ్ ప్రాంతంలో సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.