BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో గురువారం SI పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కులం, మతం, వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంటుందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. నేడు నిర్వహించిన కార్యక్రమానికి మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జ్యోతి శివరాజ్ పాల్గొన్నారు.
NRPT: నారాయణపేట మండలం శాసనపల్లిలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ రవికుమార్ గౌడ్ పరిష్కరించారు. మైసమ్మ గుడి వద్ద నూతనంగా బోరు వేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జాతర సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు.
BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 42 కుటుంబాలకు రూ. 42,04,872 విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
NGKL: వంగూరు మండల నూతన విద్యాధికారి (MEO) గా గురువారం కొండల్ రెడ్డి మండల విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి స్వాగతం తెలిపారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తానని పేర్కొన్నారు.
KMR: బీర్కూర్ మండలంలోని బైరాపూర్‌లో గురువారం ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. పశువైద్యాధికారి మారుతి మాట్లాడుతూ.. పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు వేయాలని పాడి రైతులకు సూచించారు. మొత్తం 308 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి, గోపాలమిత్ర నాగార్జున, రైతులు పాల్గొన్నారు.
ఈ నెల 15న BCCI వార్షిక అవార్డుల వేడుక ‘నమన్’ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెన్స్ టీమ్ మాజీ కోచ్ ద్రవిడ్‌ను BCCI జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025-26’ ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ సారి సీనియర్లతో పాటు U19 WC గెలిచిన మెన్స్ & ఉమెన్స్ జట్లూ వేడుకకు హాజరుకానున్నాయి.
MNCL: ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలను బాగా రాయవచ్చని ఖానాపూర్ మండలంలోని సర్పంచులు నవీన్ యాదవ్, పేట్టెం రాధ సూచించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
SDPT: కాంపౌండ్ వాల్ పనులను నాణ్యతగా నిర్మించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. మిరుదొడ్డి మండలం అల్వాల ఎక్స్ రోడ్ చెప్యాల వద్ద ఉన్న పీఎంశ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఎలాన్ మాస్క్ తన AI చాట్‌బాట్ ‘Grok’ సేవల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇకపై గ్రోక్ సేవలను ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లుకు మాత్రమే. సాధారణ యూజర్లకు ‘Ask Grok is currently available to premium and premium+ subscribers only’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ప్లాట్‌ఫామ్ ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగానే ఈ నియంత్రణ విధించినట్లు తెలుస్తోంది.
RR: ప్రజాపాలన-ప్రగతిప్రణాళికలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పాలకవర్గానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ తరగతులకు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయన్నారు.
WGL: ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలోని సాయి సిద్దార్థ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రూ.4 లక్షల విలువైన నిల్వ చేసిన కల్తీ కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇండస్ట్రీ నిర్వాహకుడు సురేష్‌ను టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ స్థానిక ఎనుమాముల పోలీసులకు అప్పగించారు. కల్తీ కారం తయారీపై కేసు నమోదు చేశారు.
ప్రకాశం: సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేసి జగన్‌మోహన్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
AP: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖలో క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో భారీ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
సత్యసాయి: కదిరిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ స్థాపించబడిందని, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు.