HYD: ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశిష్ట ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి భౌతిక కాయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. వారి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవ్వాల నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం రెండు కేంద్రాలలో కలిపి 519 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 509 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) నూతన సంచాలకులుగా ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశ్వవిద్యాలయ రిజిస్టార్‌గా కొనసాగుతున్నారు. విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యపై దృష్టి సారిస్తామని తెలిపారు.
TG: నిర్మల్ జిల్లాలోని ఇచ్చోడ మండలం సోంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 18 మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
VKB: బీజేపీ రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్‌గా వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆయనకు నియామక పత్రం అందజేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.
KRNL: పెద్దకడబూరులో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయి కుమార్ మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని రక్షిత మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
NRPT: మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామ పంచాయతీలో గురువారం సర్పంచ్ రాజేందర్ గౌడ్ చొరవతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. స్వల్ప సమస్యలు ఉన్నవారికి వైద్యం అందించారు. అవసరమైన వారికి మహబూబ్ నగర్‌లో గురువారం ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మందులు అందజేశారు. ఈ సేవలపై గ్రామస్థులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిర్ణీత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మెచ్యూరిటీ కాలంలో పాలసీదారు చనిపోతే కవరేజీ మొత్తం నామినీకి అందజేస్తారు. ఒకవేళ పాలసీదారు జీవించి ఉంటే ఎలాంటి లాభాలు పొందలేరు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ జీవితాంతం రక్షణనిస్తుంది. ఇందులో వ్యక్తి మరణించినా, పాలసీ గడువు ముగిసినా మెచ్యూరిటీ బెనిఫిట్స్ రూపంలో డబ్బు తిరిగి వస్తుంది.
BDK: పాల్వంచ మండలాలలో గత 4 ఏళ్లుగా ఇసుక, మట్టి, కంకర మైనింగ్ కార్యకలాపాలు అధికంగా అక్రమంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పాల్వంచ మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే అరికట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక, మట్టి ర్యాంపులను ప్రారంభించాలని బీజేపీ నాయకులు కలెక్టర్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు.
HYD: పీక్ హవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్డికాపూల్ మెట్రో స్టేషన్ నుంచి RBI వరకు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి, ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 40 నిమిషాలకుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రూ.1,500 – 2,000 కోట్లు వసూలు చేయడం ఖాయమని చెప్పాడు. అదే జరిగితే సౌత్ సినిమాలన్నీ తోక ముడవాల్సిందేనని అన్నాడు. సౌత్ యాక్షన్ చిత్రాలు పాత కథనాలతోనే సాగుతున్నాయని, కానీ ‘ధురంధర్’ సిరీస్ బాలీవుడ్ యాక్షన్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నాడు.
ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 35 మంది లబ్ధిదారులకు ₹30 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ₹5.50 కోట్ల మేర వైద్య సహాయం అందించామని, ఇందులో మైనార్టీలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
TPT: సత్యవేడు మండలంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
T20 WCలో నెదర్లాండ్స్, ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచులకు అక్షర్‌ను జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై అతనికి క్షమాపణలు చెప్పినట్లు కెప్టెన్ సూర్య తెలిపాడు. పక్కన పెడుతున్నట్లు చెప్పినప్పుడు అక్షర్ అసహనం వ్యక్తంచేశాడని, ఎంతో అనుభవం గల ప్లేయర్ అలా చేయడంలో తప్పేలేదని, అందుకే క్షమాపణలు కోరానన్నాడు. కాగా అక్షర్ టోర్నీలు 4 కీలక క్యాచులు, 11 వికెట్లు తీశాడు.