RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ చికెన్ షాప్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చికెన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సింగ్ విధానం తెస్తోందని, నాణ్యతతో పాటు పరిశుభ్రత ఉన్న మాంసం అమ్మకాలు జరపాలని సూచించారు.
CTR: ప్రజా సమస్యల పరిష్కారమే వైసీపీ ధ్యేయమని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వీ.కోట అంబేద్కర్ సర్కిల్లో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవంను ఎంపీపీ యువరాజ్‌తో కలిసి గురువారం ఆయన నిర్వహించారు. వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. మళ్లీ అధికారం సాధించడమే తమ లక్ష్యమన్నారు.
అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామానుజులు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గురువారం ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన ఆయనను నర్సింగ్ హెడ్ మంజుల అభినందించి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
TG: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ముందుండే మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో అటుగా మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి.. తన కాన్వాయ్‌ని ఆపి రోడ్డుపై ఉన్న మృతదేహాలను పక్కకు తీశారు.
NZB: నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గోపీని హతమార్చింది సమీప బంధువు, వరుసకు మేనల్లుడైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KRNL:పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో హానుమపురం MPTC శశిరేఖ అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు కనీస తాగునీటి అవసరాలు తీర్చలేనప్పుడు నాయకులుగా ఉండటం వ్యర్థమని ఆమె విమర్శించారు. తాగునీటి కోసం కోట్లు ఖర్చు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరు 1వవార్డులో మురుగునీటిలో ఉన్న పైపును తక్షణమే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.
SRCL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలన్నారు విద్యార్థులు పాల్గొన్నారు.
KMM: నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 16న జిల్లా కేంద్రాలలో, 23న సెంట్రల్ లేబర్ ఆఫీస్ హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాలను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు షేక్ సుభహన్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఖమ్మం బల్లేపల్లిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ అదానీ, అంబానీకి దేశ సంపద అప్పచెబుతుందన్నారు.
మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిక్షణ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DCP భాస్కర్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.
TG: హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని CM రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, TFDC ఛైర్మన్ దిల్‌రాజు హాజరయ్యారు. ఇక నుంచి HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (AVGC) రంగం మరింత బలోపేతం కానుంది. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన VFX సేవలు కూడా ఇక నుంచి ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి.
KDP: ఒంటిమిట్ట నడివీధి గంగమ్మ అమ్మవారి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. వేకువజామున అమ్మవారిని మంగళవాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి నడివీధిలో కొలువుదీర్చారు. అమ్మవారిని పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.
NDL: మిడుతూరు మండలం రోళ్లపాడులో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్య గిత్త జయసూర్య గురువారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పశువులకు ట్యాగిoగ్, గాలి కుంటు టీకాలు వేయించాలని, అప్పుడే వ్యాధులు రాకుండా నివారించడం అన్నారు. దగ్గరుండి పశువులకు టీకాలు వేయించారు. పశు వైద్య అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్ని సూచించారు.
ప్రకాశం: కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
BPT: సంతమాగులూరు మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మంత్రి గుట్టిపాటి కుమారుడు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చవిటిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 252 మంది విద్యార్థులకు, మిన్నేకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపధ్యాయులు, గామస్తులు పాల్గొన్నారు.