NZB: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత కమిటీల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 13లోగా మండల, పట్టణ కమిటీల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాలని డీసీసీలు కసరత్తు చేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తూ, MLA లు మరియు ఇన్‌ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఈ నెల 26లోగా పూర్తిస్థాయి కార్యవర్గాలను ప్రకటించనున్నారు.
సత్యసాయి: పరిగిలో YCP 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
VZM: ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బొబ్బిలిలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఎగురు వేసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు DIEO వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన పరీక్షకు జిల్లాలో 1,497 మంది విద్యార్థులు హాజరుకావాల్సిందిగా 1,381 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 116 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసామన్నారు.
HNK: కలెక్టరేట్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శిక్షణ కార్యక్రమానికి హాజరై ప్రజా ప్రతినిధులకు పలు సూచనలను చేశారు. 99 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు.
ASR: ఈనెల16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు జిల్లాలో 4ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్‌కు సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నపత్రాలు పోలిస్ స్టేషన్‌లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు.
WNP: అమరచింత మున్సిపాలిటీ 8వ వార్డు పెద్ద పీర్ల మసీద్ వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీతో కాలనీవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డుపై బురద పేరుకుపోయి, రాత్రివేళ దుర్వాసన, దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
NLG: మునుగోడు మండలంలోని కలవలపల్లిలో ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు.
KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మధిర మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత- రామనాథం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మధిర పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల మంజూరుపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.
GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. 1-03-2011 నుంచి 10-03-2012 మధ్య జన్మించిన బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హత గల బాలికలను PHCకు పిలిపించి వైద్యుల సమక్షంలో టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
NGKL: బల్మూర్ మండలం చెన్నారంలో ఉపాధి హామీ కూలీలతో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశమయ్యారు. కూలీలకు రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని, ఏటా 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విబిరాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నాయకులు మల్లేష్, శంకర్ నాయక్ కోరారు.
కోనసీమ: ప్రజల సమస్యలకు ప్రజా దర్బార్ ద్వారా సత్వర పరిష్కారం చూపడం జరుగుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తెలిపారు. ఆయన అమలాపురంలోని క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 76 మంది సమస్యలను తెలియజేసి అర్జీలు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు
ADB: భోరజ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు.
ప్రముఖ క్రికెట్ సైట్ ESPNcricinfo 2025 వార్షిక అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన హర్మన్ ఉమెన్స్ కెప్టెన్-2025గా నిలవగా.. టెంబా బవుమా(SA)ను మెన్స్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బ్యూ వెబ్‌స్టర్(AUS), తెలుగు క్రికెటర్ శ్రీచరణి డెబ్యుటెంట్ అవార్డ్స్ గెలుచుకున్నారు. వివిధ విభాగాల్లో భారత ప్లేయర్లకు మొత్తం 9 అవార్డ్స్ లభించాయి.
MHBD: పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, మత్తు పదార్థాల వినియోగం దృష్టికి వస్తే తమకి తెలియజేయాలని, మున్సిపల్ సిబ్బందిని, ప్రజలను కోరారు.