కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్ర
GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసు
SRPT: పెన్‌పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందన
GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసా
SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్‌పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టిం
NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగ
GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున
AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్
AP: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం నలుగురు పోలీసులపై వేటు వేసింది. కేసులో నాటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీలు భీమరావు, మురళికృష్ణతో పాటు ఎస్ఐలు సతీష్ బాబు, మురళీకృష్ణపై సస్పెండ్ చేసింది.