KMM: కామేపల్లి మండలం కొత్తలింగాల విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ ఎన్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ‘లైన్ మెన్ దివాస్’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే వో అండ్ ఎం సిబ్బందిని ఏఈ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజ
కృష్ణా: కానూరుకు చెందిన వాసిపల్లి కళ్యాణ్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఈనెల 2వ తేదీ రాత్రి ఇద్దరు స్నేహితులతో బార్‌కు వెళ్లాడు. ఎదురుటేబుల్ వద్ద మద్యం మత్తులో కొందరు గొడవపడటాన్ని చూసి కళ్యాణ్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఆగ్రహించిన నలుగురు బ
ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘చిక్ని చమేలి’ వంటి పాటలు పాడే సమయంలో సాహిత్యంపై తనకు అవగాహన లేదని, ఆ పాటలను చిన్న పిల్లలు పాడుతుంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని వెల్లడించారు. అందుకే సామాజిక బాధ్యతతో ఇక
MBNR: మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్
MHBD: మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. ఇటీవల సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసిన ఘటనపై విచారణ చేపట్టిన ఆర్సీఓ రత్నకుమారి.. ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (వీరన
PDPL: వార్డు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. రామగుండం కార్పొరేషన్లో బుధవారం వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అధికారులు వారధిగా పని చేయాలన్నారు. శానిటేషన్ ని
WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల తొలి సెమిస్టర్ పరీక్షలు ఇవాళ్టీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల పరీక్షలు ఈ నెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర
NZB: జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్
ఉమ్మడి అనంతపురం జిల్లాకు బుధవారం రైలు ద్వారా స్పిక్ కంపెనీ నుంచి 1,277 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు చేరుకున్నాయి. ఇందులో యూరియా 1,086 టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 128 టన్నులు ఉన్నాయి. వీటిని మార్క్ ఫెడ్, ప్రైవేటు డీలర్లతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు క
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగులు ఇవాళ నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ OT బకాయిలు, గ్రౌండ్ సిబ్బంది కన్వేయన్స్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే HR కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కోరారు.