• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అవిలాల-పేరూరు చెరువుల అనుసంధానంపై సమీక్ష

TPT: నగరాభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ లక్ష్యంగా అవిలాల-పేరూరు చెరువుల అనుసంధానం, అవిలాల ట్యాంక్ బండ్ అభివృద్ధిపై తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి వనరుల పరిరక్షణతో పాటు అవిలాల ట్యాంక్ బండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

April 18, 2026 / 03:13 PM IST

రేపు జిల్లాలో మంత్రి సత్యకుమార్ పర్యటన

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడిమర్రి మండలం బుడనపల్లిలో ‘VB-G RAM G’ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అనంతపురం జడ్పీ కార్యాలయం, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో నిర్వహించే వివిధ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

April 18, 2026 / 03:13 PM IST

పర్యావరణ పరిరక్షణకు బాగస్వాములు కావాలి: కలెక్టర్

PPM: పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో స్వచ్చ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి, నీరు పోసి, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో భావితరాలకు స్వచ్చ గాలి అందించాలంటే మొక్కలు నాటి సంరక్షించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

April 18, 2026 / 03:12 PM IST

కేంద్ర మంత్రితో పయ్యావుల కేశవ్ భేటీ

ATP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక ఆర్థిక అంశాలు, పెండింగ్‌లో ఉన్న నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైన పూర్తి మద్దతు అందించాలని కోరారు.

April 18, 2026 / 03:11 PM IST

చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే

SKLM: చెరువుల రక్షణ, పునరుద్ధరణ పై దృష్టి పెట్టాలని పాతపట్నం MLA గోవిందరావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఎల్.ఎన్.పేట M తురక పేట, కృష్ణాపురం గ్రామ చెరువు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువు శుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.

April 18, 2026 / 03:11 PM IST

నంద్యాలలో బయోడైజెస్టర్ ప్రారంభం

తడి చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఇవాళ నంద్యాల మండలం పొన్నాపురం కాలనీలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా రూ.17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

April 18, 2026 / 03:09 PM IST

చందన యాత్ర ఏర్పాట్లపై విహెచ్‌పీ ఆగ్రహం

VSP: చందన యాత్ర ఏర్పాట్లలో అవకతవకలు జరుగుతున్నాయని విహెచ్‌పీ ఉపాధ్యక్షులు నారాయణరావు ఆరోపించారు. శనివారం సింహాచలంలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ దర్శనం అంటూ.. టికెట్ల పేరుతో వసూళ్లు, వాలంటీర్లకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ధార్మిక సంస్థల వాలంటీర్లను పక్కనబెట్టి ఇతర సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 18, 2026 / 03:07 PM IST

జలధార-జలహారతి పనులకు శ్రీకారం

TPT: జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పేరూరు చెరువును జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని కలిసి పరిశీలించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్, జల వనరుల శాఖ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు.

April 18, 2026 / 03:03 PM IST

పెద్దవడుగూరులో ‘జలహారతి’లో పాల్గొన్న కలెక్టర్

ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలో ఇవాళ ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఘనంగా నిర్వహించారు. స్థానిక వంక వద్ద జలపూజ చేసిన అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలాల పెంపునకు జల సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు.

April 18, 2026 / 03:02 PM IST

కాలనీలో ఎమ్మెల్యే అకస్మికంగా తనిఖీ

ATP: నగరంలోని రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని కాలనీ ప్రజలతో ఆరా తీశారు. కాలనీలోని ప్రతి గడపగడపకు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులు చెప్పిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.

April 18, 2026 / 03:02 PM IST

ఎమ్మిగనూరులో డీఈవో దిష్టిబొమ్మ దగ్ధం

KRNL: విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ RPSF, PRSYF నాయకులు ఎమ్మిగనూరులో ఆందోళన చేపట్టారు. స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద రాష్ట్ర నాయకులు షాహిద్ అఫ్రీది, రఘునాథ్ ఆధ్వర్యంలో డీఈవో దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంత పాఠశాలల సమస్యలను పరిష్కరించడంలో DEO విఫలమయ్యారని వారు ఆరోపించారు.

April 18, 2026 / 03:02 PM IST

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే: HM

NTR: ‘వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందన్నారు. పిల్లలను అక్కడే చేర్పించాలని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులను కోరారు.

April 18, 2026 / 03:02 PM IST

కోదండరాముడికి విశేష పూజలు

CTR: పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ మిట్టమీద రాచ పల్లెలో కొలువైన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమం నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు అనంత కుమారాచార్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.

April 18, 2026 / 03:00 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: డీఎస్పీ

కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఇవాళ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే ప్రశాంతత, ఆరోగ్యం సాధ్యమవుతాయని తెలిపారు. ఎస్పీ నచికేత్ ఆదేశాలతో పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.

April 18, 2026 / 03:00 PM IST

‘గూడెం’ మున్సిపాలిటీ కృషి అభినందనీయం: పట్టాభి

W.G: సుందరీకరణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ చేస్తున్న కృషి అభినందనీయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం కాలువ గట్టున ఏర్పాటు చేసిన వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, వర్మీ కంపోస్టు, జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్ బోర్డులను ఆయన క్షుణంగా పరిశీలించారు. చెత్తను రోడ్ల పైన వేయరాదని తెలిపారు

April 18, 2026 / 03:00 PM IST