PPM: పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో స్వచ్చ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి, నీరు పోసి, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో భావితరాలకు స్వచ్చ గాలి అందించాలంటే మొక్కలు నాటి సంరక్షించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.