VSP: చందన యాత్ర ఏర్పాట్లలో అవకతవకలు జరుగుతున్నాయని విహెచ్పీ ఉపాధ్యక్షులు నారాయణరావు ఆరోపించారు. శనివారం సింహాచలంలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ దర్శనం అంటూ.. టికెట్ల పేరుతో వసూళ్లు, వాలంటీర్లకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ధార్మిక సంస్థల వాలంటీర్లను పక్కనబెట్టి ఇతర సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.