PPM: సీతంపేట మరియు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఎంపీ లాడ్స్ (MPLADS) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ శనివారం నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పనుల పురోగతిపై సమీక్ష జరపారు.
PPM: సీతంపేట మరియు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఎంపీ లాడ్స్ (MPLADS) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ శనివారం నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పనుల పురోగతిపై సమీక్ష జరపారు.
BPT: తెనాలి నుంచి పూడివాడ మీదుగా నిజాంపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రిప్పులను అదనంగా మరో రెండు పెంచాలని కోరుతూ రేపల్లె టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత శివప్రసాద్ వెంటనే తెనాలి డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలకోటేశ్వరరావు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
NLR: విద్యా వారోత్సవాల్లో భాగంగా వెంగళరావు నగర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM షేక్ హసీనా జ్ఞానబాట బడిట కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందితో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
గుంటూరు: అపార్ట్మెంట్లు, లాడ్జ్‌లు, ఫంక్షన్ హాళ్లలోని సెప్టిక్ ట్యాంకులను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు తెలిపారు. క్లీనింగ్ చేసిన తరువాత మాత్రమే ఎన్వోసీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ప్రకాశం: తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పర్యటించారు. గ్రామపంచాయతీ రిక్షాలు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లే విధంగా ఉండాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు: మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ఈ నెల 21న గుంటూరు నగరంలో 2K వాక్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేయస్ లక్ష్మణరావు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ ఫోరమ్ శుక్రవారం బ్రాడీపేటలో 2K వాక్ పోస్టర్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడారు. ఉదయం 8 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడు శుక్రవారం అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చాడు. పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కి ప్రత్యేక అభిషేకాలు చేపట్టి, పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు. భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కోనసీమ: అమలాపురం మున్సిపల్ కాలనీలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. పరస్పర ఫిర్యాదుల మేరకు మీసాల కృష్ణకుమారి వర్గంపై ముగ్గురు, గాడ విజయ్ పిర్యాదుతో మరో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
NTR: నందిగామలో అర్చకుడు సాయిరాం నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచాడు. రాగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు బ్యాగును గొల్లమూడి శివాలయ అర్చకుడు సాయిరాం రోడ్డుపై గుర్తించాడు. వెంటనే సమాచారం ఇచ్చి, పోలీసుల సమక్షంలో యజమానికి నగదు అందజేశాడు. పోయిందనుకున్న డబ్బు తిరిగి రావడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
PPM: మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల, ప్రయాణికుల, పాదచారుల, వాహనదారుల యొక్క దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసాము అన్నారు.
VZM: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కార్యకర్తలు వారధిలా పనిచేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్.కోట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆమె కేడర్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
NDL: టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ శుక్రవారం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి వీఓఏల పాత్ర కీలకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మోపిదేవి మండలానికి చెందిన 32మంది వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సమకూర్చిన నూతన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే చేతులమీదుగా అందచేశారు. వెలుగు ఏపీఎం డీ.శ్రీను పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహ నిర్మాణానికి వైసీపీ నాయకులు శుక్రవారం శ్రీ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద చెరువులో నిర్మాణం వల్ల అయకట్టు రైతులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమైంది. అందువల్ల విగ్రహాలను శ్రీ బృహ్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించాలని సూచించారు.