• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతన్న సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి

E.G: తాళ్లపూడిలో సోమవారం నిర్వహించిన ‘రైతన్న సేవలో’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నామన పరమేష్, సిద్దా దుర్గా ప్రసాద్, కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

March 23, 2026 / 05:54 PM IST

‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం

PLD: అమరావతి మండలం ధరణికోటలో నిర్వహించిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.

March 23, 2026 / 05:50 PM IST

అర్జీలను స్వీకరించిన ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల విన్నపాలను స్వీకరించారు. వాటిని చట్టపరంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 23, 2026 / 05:50 PM IST

‘పన్ను వసూళ్ల టార్గెట్ రూ. 98 కోట్లు’

కాకినాడ జిల్లాలో 100% పంచాయతీ పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ. 98 కోట్లలో, వోఎన్జీసీకి చెందిన రూ. 17 కోట్ల వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన రూ. 81 కోట్లలో ఇప్పటివరకు రూ.56. 58 కోట్లు(66.5%) వసూలైనట్లు ఇంఛార్జ్ DPO లక్ష్మణరావు సోమవారం తెలిపారు. మిగిలిన బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని చెప్పుకొచ్చారు.

March 23, 2026 / 05:47 PM IST

అప్పన్న కళ్యాణానికి తలంబ్రాల సమర్పణ

VSP: సింహాచల క్షేత్రంలో ఈనెల 29న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తలంబ్రాల కోసం అవసరమైన సుమారు 5 కిలోల మేలిరకపు ముత్యాలను విజయలక్ష్మి డైమండ్స్ అధినేత వి. శివశంకర్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి సమర్పించారు.

March 23, 2026 / 05:45 PM IST

‘దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి’

ATP: అకాల వర్షాల వల్ల ఉరవకొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, కనీస మద్దతు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బెలుగుప్ప, కూడేరు మండలాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

March 23, 2026 / 05:43 PM IST

పోలీస్ దాడులు.. ఆరుగురు జూదరులు అరెస్ట్

CTR: బలిజ కండ్రిగ ధర్మరాజు ఆలయం సమీపంలోని అడవిలో జూదం ఆడుతున్న వ్యక్తులపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో ఆరుగురు జూదరులను అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప, పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో రూ.55 వేల నగదు, 5 బైక్‌లు, 9 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.

March 23, 2026 / 05:40 PM IST

‘దక్షిణాదిన సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

KDP: దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తాలక్ష్మిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్యకు వినతిపత్రం సమర్పించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి బాధితులు న్యాయం కోసం ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు వెళ్లాలంటే అధిక వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

March 23, 2026 / 05:35 PM IST

కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి

E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వై. మేఘా స్వరూప్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అటువంటి మహనీయుల జీవితం నుంచి స్పూర్తి పొందాలని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

March 23, 2026 / 05:35 PM IST

భాదితుడిని పరామర్శించిన కోలగట్ల

VZM: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన గంట్యాడ ఎంపీపీ జైహింద్ కుమారుడిని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పరామర్శించారు. ఈమేరకు అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో వైసీపీ నేతలు ఉన్నారు.

March 23, 2026 / 05:34 PM IST

జిల్లా పోలీస్ కార్యాలయానికి 37 ఫిర్యాదులు

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 7 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.

March 23, 2026 / 05:33 PM IST

ప్ర‌తి అర్జీకీ నాణ్య‌మైన ప‌రిష్కారం చూపాలి: కలెక్టర్

NTR: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్, జేసీ ఇలక్కియ కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 112 అర్జీలు అందగా, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

March 23, 2026 / 05:33 PM IST

గ్రామీణ వైద్య రంగం బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కృష్ణా: గ్రామీణ వైద్య రంగం బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం మోపిదేవి మండలం వెంకటాపురంలో రూ. 36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. 14 నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.5.04 కోట్లు, 15 అసంపూర్తి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.1.36 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు.

March 23, 2026 / 05:32 PM IST

మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్

W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం “మీ ఇంటికి మీ డాక్టర్” మొబైల్ మెడికల్ యూనిట్‌ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రులకు రాలేని ప్రజలకు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ జిల్లాలో నిర్వహిస్తామన్నారు.

March 23, 2026 / 05:31 PM IST

నీటి సంరక్షణపై అవగాహన పెంచాలి: కలెక్టర్

GNTR: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వినియోగాన్ని తగ్గించి, భవిష్యత్ తరాలకు నీటిని కాపాడాలని పిలుపునిచ్చారు.

March 23, 2026 / 05:30 PM IST