GNTR: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వినియోగాన్ని తగ్గించి, భవిష్యత్ తరాలకు నీటిని కాపాడాలని పిలుపునిచ్చారు.