విజయనగరంలో ఓ పోలీస్ అకాడమీ విద్యార్థి సీతారాం దొరికిన 2 తులాల బంగారు బ్రాస్లెట్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడు మస్తాన్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం సంప్రదించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిర్ధారణ చేసి బాధితుడికి బ్రాస్లెట్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థి సీతారాంను సీఐ సత్కరించారు.
NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు సోమవారం చేపట్టారు. మొత్తం దాదాపుగా 45 రోజులకు గాను రూ. 52,20,244 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. హుండీల ద్వారా వచ్చిన మొత్తమును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పెంచలకోన బ్రాంచ్‌లో జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు.
SKLM: ఆమదాలవలస మండలం మెట్టక్కివలసలోని శ్రీ చెవిటమ్మ తల్లి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రహదారి నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు.
W.G: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతా భాయ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం స్పష్టం చేశారు. జిల్లాస్థాయి సలహా సంఘ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పరీక్షలకు సహకరించే వారిని కూడా విడిచిపెట్టబోమన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ యంత్రాంగంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ, పోలీస్, మెడికల్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమస్యలపై విడివిడిగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. పలు ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు తగు సూచనలు చేశారు.
CTR: పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ కోరారు. మండల కేంద్రమైన చౌడేపల్లిలో ఇంటి, నీటి పన్నుల వసూళ్లను సోమవారం ఆయన తనిఖీ చేశారు. పన్ను బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలన్నారు. పీడీఓలు, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకుని ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలం బసినేనిపల్లిలో సోమవారం డ్రోన్లు ఉపయోగించి పురుగుమందు పిచికారిపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రఫీ మాట్లాడుతూ.. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం ముఖ్యంగా పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లడానికి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యమైన భాగంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
CTR: కాణిపాకం వినాయక స్వామి వారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ ఐపీఎస్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాన్ని ఐజీకి అందజేశారు.
అన్నమయ్య: మదనపల్లిలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అధికారులు,శెట్టిబలిజ సంఘ ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. విద్యా ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపనకు కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముస్లింపాలెంలో పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న టీడీపీ నేత బాలసుందరంను పరామర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ATP: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరాపై దృష్టి సాధించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ బీజేపీ మాజీ కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. వేసవికాలం మొదట్లోనే నీటి సరఫరా సరైన సమయంలో అందక ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గడిచిన రంజాన్, ఉగాది పండుగ వేళల్లో కూడా నీటి సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
SS: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నంబులపూలకుంట(మం) ధనియాని చెరువు గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకాల సహకారంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించి భావితరాల భవిష్యత్తును కాపాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 28 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో చీటింగ్ 6, కుటుంబ తగాదాలు 5, భూతగాదాలు 6 ఫిర్యాదులు అందాయన్నారు.
KDP: సింహాద్రిపురంలో శనివారం రాత్రి మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానిక హెచ్.పీ గ్యాస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మైదానంలో మూడు టిప్పర్ లారీలను పార్కింగ్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్ల నుంచి మూడు డబుల్ లారీలను దొంగతనం చేశారు. వీటి విలువ రూ.90వేలు ఉంటుందని బాధితుడు సుధీర్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు.
ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఎస్.శ్రీనివాసరావు, ఐసీఆర్పీ ఎస్.వరలక్ష్మి తెలిపారు. కొయ్యూరు మండలం గింజర్తిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు.