• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భద్రాచలం పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: వైసీపీ పాలన ముగిసి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న మొక్కులో భాగంగా కొవ్వూరులో చాగల్లు ప్రాంతం భక్తులు చేపట్టిన పాదయాత్రను గురువారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. గత 10–12 సంవత్సరాలుగా జిల్లాలోని కొవ్వూరు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి అనేకమంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం వెలుతుంటారు.

March 26, 2026 / 11:56 AM IST

గడ్డివాముకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ATP: పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టిన ఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి పశుగ్రాసం కోసం వీటిని ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 26, 2026 / 11:55 AM IST

ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా జడ్పీ చైర్‌పర్సన్

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థలానికి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేరుకున్నారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.

March 26, 2026 / 11:41 AM IST

బస్సు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

NDL: మార్కాపురం జిల్లాలో ఇవాళ జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుని పదిమంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

March 26, 2026 / 11:39 AM IST

అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

KDP: గ్యాస్ కొరత ప్రభావంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 11,400 కేంద్రాలకు స్టవ్‌లు అందించగా.. సానుకూల స్పందన రావడంతో మిగిలిన వాటికి ఇవ్వాలని నిర్ణయించింది.

March 26, 2026 / 11:38 AM IST

ప్రభుత్వ పాఠశాలకు మైక్ సెట్ బహుకరణ

NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆ పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. గురువారం ఆ మైక్ సెట్‌ను ఇచ్చినట్లు హెచ్ఎం చెంచురామయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దాదాపుగా 61 వేలు విలువైన మైక్ సెట్‌ను బహుకరించినట్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.

March 26, 2026 / 11:37 AM IST

బస్సు ప్రమాద ఘటనపై కూటమి నేతల స్పందన

NLR: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు 10 మందికిపైగా ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

March 26, 2026 / 11:35 AM IST

‘యాతపాలెంలో ఆధునిక పార్కు నిర్మాణం’

VSP: గాజువాక 64వ వార్డు యాతపాలెంలో ఎకరా స్థలంలో ఆధునిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం డైరెక్టర్ మొల్లి పెంటిరాజు స్థలాన్ని పరిశీలించారు. కాలుష్యం తగ్గించేందుకు చెట్లు నాటి పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచనలతో APIIC నిధులతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.

March 26, 2026 / 11:30 AM IST

టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు భారీగా విరాళాలు

TPT: టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు దాతలు భారీగా విరాళాలు అందించారు. మొత్తం రూ.60 లక్షల విరాళం అందగా, చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన వి. భవేశ్ చౌదరి రూ.10,07,777, తూర్పు గోదావరి జిల్లా చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు సమర్పించారు. తిరుమలలో అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.

March 26, 2026 / 11:29 AM IST

భార్యాభర్తలపై నమోదైన చీటింగ్ కేసు

అన్నమయ్య: మదనపల్లె(M)చిప్పిలిలో అంగన్‌వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలిపింది. 

March 26, 2026 / 11:22 AM IST

రాయవరం రోడ్డు ప్రమాద ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి

KRNL: గురువారం మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో, బస్సులో మంటలు చెలరేగి పది మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు.

March 26, 2026 / 11:21 AM IST

మార్కాపురం బస్సు ప్రమాదం.. మంత్రి దిగ్భ్రాంతి

అన్నమయ్య: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి, ఈ కష్టకాలంలో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి తక్షణం ఉత్తమ వైద్యం అందించాలన్నారు.

March 26, 2026 / 11:20 AM IST

రిజిస్ట్రేషన్ ఫీజు వాటా బకాయిలు భారీగా పెరుగుదల

CTR: భూములు, ఇళ్లు, కమర్షియల్ భవనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 90% స్థానిక సంస్థలకు చెల్లించాల్సి ఉండగా, తిరుపతి కార్పొరేషన్‌కు 2024 జూలై నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో రూ. 25 కోట్ల బకాయికి చేరింది. చిత్తూరు కార్పొరేషన్‌కు సుమారు రూ.45 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సర్‌ఛార్జీల చెల్లింపులు లేకపోవడంతో స్థానిక సంస్థల ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది.

March 26, 2026 / 11:20 AM IST

‘హంద్రీ-నీవాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

KRNL: హంద్రీ- నీవా సుజల స్రవంతి (HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డ్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ జరగుతుందని తెలిపారు.

March 26, 2026 / 11:18 AM IST

బైక్ ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

NDL: బేతంచెర్ల సమీపంలోని జిల్లా రహదారిపై ఇవాళ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గోరుమాను కొండ వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం అధిగమించే క్రమంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్‌తో పాటు మరో యువకుడు గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు పంపించారు.

March 26, 2026 / 11:16 AM IST