• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దొరవారిసత్రంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

TPT: దొరవారిసత్రం ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని, మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టుమిషన్లు దోహదమని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 02:35 PM IST

లయన్స్ ఆస్పత్రికి విరాళం

VSP: లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.59 లక్షల విరాళం అందించింది. సంస్థ డైరెక్టర్ కృష్ణారావు ఈ మొత్తాన్ని హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావుకు అందజేశారు. ఈ నిధులతో ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ, యూరిన్ ఎనలైజర్లు కొనుగోలు చేయనున్నారు.

March 26, 2026 / 02:31 PM IST

బస్సు ప్రమాదం.. గుడ్లూరు మహిళకు గాయాలు

NLR: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గుడ్లూరు మండలం వెంకంపేటకు చెందిన తుపాకుల రత్తమ్మ గాయపడ్డారు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మరో ఇద్దరితో కలిసి బస్సులో దుత్తలూరుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆమెతో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. రత్తమ్మతో పాటు మరొకరు మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

March 26, 2026 / 02:31 PM IST

కోడిగుడ్డు ధర పతనం.. పౌల్ట్రీ ఆందోళన

ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో రూ.7 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 4 నుంచి రూ. 4.5కు తగ్గిందని వారు తెలిపారు. చికెన్ ధరలు పెరిగినా, ఎగుమతులు తగ్గిపోవడం వల్ల గుడ్లకు డిమాండ్ పడిపోయి భారీ నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు చెప్పుకొచ్చారు.

March 26, 2026 / 02:30 PM IST

నారా లోకేష్‌ను కలిసిన నిమ్మల కిష్టప్ప

సత్యసాయి: TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గురువారం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడు నిమ్మల అంబిరీష్‌తో కలిసి అమరావతిలో మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా వినతులు అందజేశారు.

March 26, 2026 / 02:30 PM IST

తిమ్మాయపాలెంలో ఇంటి పన్ను 100 శాతం వసూళ్లు

BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామపంచాయతీలో గురువారం హౌస్ టాక్స్ వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈరోజు రూ.11,250 హౌస్ టాక్స్ వసూలై, మొత్తం 31 అసెస్మెంట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.

March 26, 2026 / 02:28 PM IST

ప్రజా దర్బార్ కార్యక్రమానికి 75 అర్జీలు

NTR: జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 75 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రామాభివృద్ధికి రహదారులు, వంతెనలు సహా పలు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

March 26, 2026 / 02:27 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్‌ల పంపిణీ

CTR: మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

March 26, 2026 / 02:20 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ఆదిత్య కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం, అతివేగ నియంత్రణ వంటి అంశాలపై సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

March 26, 2026 / 02:20 PM IST

రేపు మాంసం దుకాణాలు బంద్

VSP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నగరంలో మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వి నరేష్ కుమార్ తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 26, 2026 / 02:19 PM IST

మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ భరోసా

సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ బృందాలు మహిళలు, బాలికల భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని గురువారం నిర్వహించిన సదస్సులో పోలీసులు వివరించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గృహ హింసపై అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 02:15 PM IST

‘జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది వైఎస్ఆర్’

AKP: జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. గురువారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరువు నివారణకు ఎస్ఈజెడ్‌ను వైఎస్ఆర్ తీసుకువచ్చిన విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. అలాగే, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదిత్యా మిట్టల్‌ను జగన్ ఆహ్వానించారన్నారు.

March 26, 2026 / 02:13 PM IST

‘గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి పునాది’

SKLM: మందసలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వచ్చ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి మూలం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.

March 26, 2026 / 02:11 PM IST

తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత.!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి బైక్‌లకు కేవలం లీటరు పెట్రోలు మాత్రమే పోస్తున్నారు. అదికూడా లీటరుకు 10 రూపాయల ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పెట్రోల్ కోసం వినియోగదారులు క్యూ లైన్లలో అర్ధ గంట ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 02:09 PM IST

బాధితులకు ఉదయగిరి ఎమ్మెల్యే పరామర్శ

NLR: మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ స్పందించారు. మోటు చింతల పాలేనికి చెందిన కొండయ్య భార్య, ఇద్దరు పిల్లలు ఆ బస్సులో ఉన్నారని తెలియడంతో ఎమ్మెల్యే కొండయ్యకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. తన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని కొండయ్య చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

March 26, 2026 / 02:08 PM IST