SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లిలో గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
KDP: సిద్ధవటం(మం) మాధవరం-1లోని జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు గురువారం గ్రామ సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో రోజువారీ అవసరాలు కూడా నెరవేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
అన్నమయ్య: పుంగనూరులోని టీటీడీ పరిధిలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ ఇన్‌స్పెక్టర్ సీ. కృష్ణమూర్తి బదిలీ అయ్యారు. ఆయనను తిరుపతిలోని జేఈవో(హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సీ.సీ.గా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానంలో ఇన్‌స్పెక్టర్‌గా యశ్వంత్ నియమించింది.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని పంచాయతీ కార్యాలయం, పెద్దమ్మ గుడి, కొత్తపల్లి క్రాసింగ్ వద్ద గురువారం మూడు చోట్ల చలివేంద్రాలను ప్రారంభించారు. మండల ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రార్థించారు. ఎండల కారణంగా ప్రజలు, ప్రయాణికులకు తాగునీరు అందించేందుకు ఈ చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు.
CTR: పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద పండితులు హోమాధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారి మూల విగ్రహాన్ని అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
AKP: ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగిన లింగంపేట శ్రీ నూకాలమ్మ తల్లి జాతర హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీ ఆదాయం రూ.1,55,639, తలనీలాల రూపంలో రూ.66వేలు, టికెట్ల రూపంలో 93070 రూపాయలు వచ్చినట్లు దేవాదాయ ధర్మ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.
NDL: తమ హక్కుల సాధన కోసం జీవో 98 బాధితులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నంది కొట్కూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శాంతి యుత దీక్ష చేపట్టిన బాధితుడు జయన్న మాట్లాడారు. జీవో 98 ద్వారా ఉద్యోగాలు సాధించాడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల వినతులను తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపించి, పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.
KKD: దేశ ఆర్థిక పురోగతికి ‘దివాళా చట్ట సవరణ బిల్లు-2025’ ఎంతగానో దోహదం చేస్తుందని, దేశ ప్రయోజనాల దృశ్యా కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం లోక్ సభలో కేంద్రం ప్రవేశ పెట్టిన దివాళా చట్ట సవరణ బిల్లు-2025 పై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు.
TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ప్రారంభించారు. 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి సుమారు రూ.15 లక్షల నిధులతో ఈ రోడ్డు నిర్మించారు. అనంతరం ఆయన వెలుగు సంఘం మహిళల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా తయారవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.
కృష్ణా: పామర్రు (M కురుమద్దాలి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. పాడి రైతుల అభివృద్ధి కోసం కూటం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి, డీఎస్పీకి ఇవాళ అందజేశారు. రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసు శాఖ సహకారం అందించాలన్నారు.
E.G: భద్రాచలం శ్రీ సీతారాముల వారిని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు పాదయాత్రగా వచ్చిన భక్తులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కును చెల్లించుకున్నాను. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు ఉన్నారు.
W.G: యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో ఆకివీడు ప్రజలు కర్రీ పాయింట్ల బాటపట్టారు. వండుకునే భారం తగ్గుతుందని వినియోగదారులు భావిస్తుండటంతో కర్రీ పాయింట్లకు క్యూ కడుతున్నారు. గ్యాస్ ధరల ప్రభావంతో నిర్వాహకులు సైతం కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వెజ్ కర్రీపై రూ. 10, నాన్ వెజ్‌పై రూ. 20 వరకు ధరలు పెంచారు.
KDP: గోపవరం(మం) పెద్ద గోపవరం ఎస్సీ కాలనీ వద్ద బావిలోకి ఈతకు వెళ్లిన మల్లేశ్(36) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక ఇంఛార్జ్ చంద్రుడు వారి సిబ్బందితో కలిసి 3 గంటలపాటు శ్రమించి బావిలో ఉన్న శవాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న గోపవరం SI రంగారావు విచారణ చేపట్టారు.