KDP: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్రవారం తలంబ్రాల ప్యాకింగ్‌ను టీటీడీ శాస్త్రోక్తంగా ప్రారంభించింది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించారు.
W.G: ఉండి మండలం వెలివర్రులో శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం శుక్రవారం రంగరంగ వైభవంగా జరిగింది. పీటల మీద మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు కూర్చున్నారు. మండలంలో చెరుకువాడ, ఉండి, కొలమూరు, కలిసిపూడి, యండగండి తదితర గ్రామాలల్లో కళ్యాణం జరిగింది. చలివిడి, వడపప్పు, పానకం ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
KRNL: ఆలూరులో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న 21వ AITUC జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు నందవరంలో కరపత్రాలు విడుదల చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించి, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
E.G: శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కల్యాణోత్సవ వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు . శుక్రవారం ఉదయం నిర్వహించిన పల్లకి సేవ శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అన్నమయ్య: శ్రీరామనవమి పండగ సందర్భంగా సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ.. మదనపల్లిలో జనసేన నాయకుడు రాయల్ గణి ఆధ్వర్యంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో స్వల్ప గాయాలకు గురైన రామ్ చరణ్ తేజ్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
GNTR: గుంటూరు నగరంలోని 56వ డివిజన్, మోతీలాల్ లైన్ పరిధిలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను ప్రభుత్వం తొలగించాలనే చర్యలపై ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తక్షణమే స్పందించారు. ఆమె స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
KKD: పెద్దాపురం సర్కిల్ ఇన్స్‌ఫెక్టర్‌గా వైఆర్‌కె శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఐగా పనిచేసిన విజయ్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో వైఆర్కే శ్రీనివాస్ విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన సిఐ వైఆర్ కే శ్రీనివాస్‌కు స్థానిక ఎస్‌ఐ మౌనిక, స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
W.G: ఉండి మండలం చెరుకువాడలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు మాట్లాడుతూ.. కళాకారులను ఆదర్శించాలని, కళలను పోషించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో MPTC దంగేటి రామలింగేశ్వరరావు కవి, రచయిత కొల్లాబత్తుల సూర్యకుమార్ పాల్గొన్నారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషన్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ వేడుకకు హాజరు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.
NDL: బేతంచెర్ల మండలం బలపాలపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా మండల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సిమెంట్ నగర్ జట్టు ప్రథమ, బలపాలపల్లి జట్టు ద్వితీయ, బేతంచెర్ల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు పోలూరు సోదరులు, ఉన్నం సుధాకర్, జీవన్ చౌదరి రూ.20,000, రూ.10,000, రూ.5,000 బహుమతులు అందజేశారు.
NLR: ముత్తుకూరు మండల కేంద్రంలో మంచి నీటి చలివేంద్రాన్ని సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త సురేశ్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతూ గుక్కెడు మంచినీళ్లు కావాలంటే కొనుక్కొని తాగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులకు నీటి అవసరం ఎంతో ఉంటుందని, అందుకోసమే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
KDP: మైదుకూరు పట్టణానికి చెందిన సూర్యనారాయణ (42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం సాయంత్రం తన కుమారుడు నారాయణను పాఠశాలలో వదిలేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా, కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నాడు.
BPT: బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మండపాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
KRNL: సీఎం చంద్రబాబును కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులపై ఆయన సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
PPM: పార్వతీపురం నుంచి వల్లరిగుడబ వరకు రూ.2 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.