• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హోళగుంద పంచాయతీకి ప్రత్యేక అధికారి నియామకం

KRNL: హోళగుంద పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తికి అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయనను ప్రత్యేక అధికారిగా ఇవాళ నియమించారు. కలెక్టర్ ఆదేశాలతో పరిపాలనలో అంతరాయం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై పంచాయతీ పనులు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.

April 2, 2026 / 05:30 PM IST

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు

కడప జిల్లాలో నేటితో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం 167 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షను అధికారులు నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను నేడు నిర్వహించారన్నారు. నేటి పరీక్షకు 27,826 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,650 మంది పరీక్షలు రాశారు. 176 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.

April 2, 2026 / 05:30 PM IST

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: సీఎండీ

అన్నమయ్య: APSPDCL పరిధిలో నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారం వెలుగులోకి రావడంతో సంచలనం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో నియమితులైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను సేవల నుంచి తొలగిస్తూ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు.

April 2, 2026 / 05:30 PM IST

రాజధాని బిల్లుకు ఆమోదంపై హర్షం

AKP: అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు హర్ష వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీందర్, హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ్ కృష్ణన్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపడం శుభ పరిణామం అన్నారు.

April 2, 2026 / 05:28 PM IST

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్‌కు నోటీసు

TPT: సత్యవేడు నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర నోటీసు జారీ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఈనెల 15వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు నోటీసు ద్వారా తెలిపారు.

April 2, 2026 / 05:23 PM IST

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

GNTR: ఉద్దండరాయునిపాలెంలో సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సీఎం రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో భేటీ కానున్నారు. అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.

April 2, 2026 / 05:21 PM IST

జిల్లాలో ముమ్మరంగా ఎన్.సి.డి సర్వే

PPM: జిల్లాలో 15 మండలాల్లో అంటువ్యాధులు కాని వ్యాధుల గుర్తింపుకు ఎన్.సి.డి సర్వే 4.0 ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు బాధితులను గుర్తిస్తూ, అవసరమైన మందులు అందజేస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధులు పెరుగుతున్నాయని సూచించారు.

April 2, 2026 / 05:16 PM IST

నేటితో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

ATP: గుత్తిలోని 6 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు గురువారం ఇంగ్లీష్ పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయని ఎంఈవో రవినాయక్ తెలిపారు. రంజాన్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్ష గురువారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయ, పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

April 2, 2026 / 05:15 PM IST

ఇప్పటం విలేజ్ సర్వేయర్ సస్పెండ్

GNTR: ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నలుగురు సచివాలయ ఉద్యోగులపై వేటు పడింది. దరఖాస్తులపై వీరు మాన్యువల్ సంతకాలు అడుగుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కడప జిల్లా టీ.సుండుపల్లె, గుంటూరు జిల్లా ఇప్పటం విలేజ్ సర్వేయర్లను సస్పెండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు.

April 2, 2026 / 05:15 PM IST

‘జూన్ నాటికి పూర్తి చేయాలి’

ASR: చింతపల్లి జడ్పీ పాఠశాలలో టైప్-2 కస్తూర్భా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. గురువారం పాఠశాలలో కేజీబీవీ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. నిర్మాణాలు 80శాతం పూర్తయ్యాయని, జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.

April 2, 2026 / 05:13 PM IST

‘జిల్లాలో తక్కువ వర్షాలు పడే అవకాశం’

VZM: వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఎల్‌నీనో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, దాని ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్కువ పెట్టుబడి గల ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంపై 3రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

April 2, 2026 / 05:11 PM IST

‘ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి’

SKLM: అమరావతిని చట్టబద్ధమైన రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు. గత పాలకుల కుట్రల వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పంతో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారబోతోందని పేర్కొన్నారు.

April 2, 2026 / 05:11 PM IST

విజయవాడలో వ‌ర‌ల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే కార్య‌క్ర‌మం

NTR: ఆటిజాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని.. చిన్నారులకు ఆత్మీయత పంచుదామని కలెక్టర్ లక్షీశ అన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డేను ఇవాళ విజయవాడ అయోధ్యనగర్‌లో చేయూత మానసిక దివ్యాంగుల శిక్షణ సంస్థలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆటిజం ఉన్నవారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

April 2, 2026 / 05:10 PM IST

నందవరంలో గోపుర కలశ మహోత్సవం

KRNL: నందవరంలోని మాతా బంగారమ్మ దేవి ఆలయంలో నూతన గోపుర కలశం, ముఖద్వార ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు భారీగా పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

April 2, 2026 / 05:10 PM IST

ద్విచక్ర వాహనాల దొంగకు ఆరు నెలల జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2025వ సంవత్సరంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించిన సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టి పూర్తి సాక్షాదారులతో పోలీసులు నేరాన్ని నిరూపించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి భరత్ చంద్ర నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

April 2, 2026 / 05:10 PM IST