E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లో జేసీ మేఘ స్వరూప్‌తో కలిసి 183 అర్జీలను స్వీకరించారు. PGRS కింద వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహించరాదన్నారు.
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం అని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. సోమవారం మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 82 మందికి లబ్ధిదారులకు గాను రూ.30.34 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని,పేద ప్రజలు అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తారన్నారు.
KKD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఇంఛార్జ్ ఈవో నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఈవో త్రినాథరావు పుష్కరాల విధుల్లో బిజీగా ఉండటంతో వాడపల్లి ఈవో చక్రధరరావు, కాకినాడ డీసీ రమేష్ బాబు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. చక్రధరరావుకు ఆర్జేసీగా పదోన్నతి ఉండటంతో ఆయన నియామకానికే మొగ్గు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆర్డర్ రావాల్సి ఉంది.
కోనసీమ: ప్రభుత్వ ఆదేశాలు మేరకు డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను రావులపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా నిర్వహించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సోమవారం ఆదేశించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపాలని, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు జీవనోపాధులు, ఎంటర్‌ప్రైజ్ స్థాపన కోసం రుణాలు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ సూచించారు. 50 శాతం మంది మహిళలు వ్యవస్థాపకులుగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
W.G: నరసాపురంలోని పలు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 18 వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గౌతమి, భాష్యం, చైతన్య, జె.సికిలి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. కొత్త నమోదు, వివరాల మార్పులు, బాల ఆధార్ వంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: ఉండి మండలం పెదపుల్లేరులో సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సాయం ఆశించకుండా రూ. 5 కోట్లకు పైగా వ్యయంతో శివాలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారని అన్నారు. సమస్యలు, మానసిక ఒత్తిళ్ళ నుంచి గుడికి వెళితే ఉపశమనం కలుగుతుందన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలం సంగమేశ్వరంలో రూ.23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి అర్జీదారుల వద్ద నుంచి 198 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన అర్జీలను విచారించి బాధితులకు న్యాయం చేసి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా సకాలంలో, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు నగరంలోని సివిల్ సప్లై బఫర్ గోదాంను ఆయన సందర్శించారు. ప్యాకింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయబడుతున్న 3 కిలోల, 25 కిలోల బియ్యం ప్యాకెట్ తయారీని జేసీ పరిశీలించారు.
కర్నూలు: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా సకాలంలో, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు నగరంలోని సివిల్ సప్లై బఫర్ గోదాంను ఆయన సందర్శించారు. ప్యాకింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయబడుతున్న 3 కిలోల, 25 కిలోల బియ్యం ప్యాకెట్ తయారీని జేసీ పరిశీలించారు.
CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం శ్రీ శక్తి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా భాను ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు, సమాన హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు.
PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి వివిధ అంశాలపై మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
W.G: మే 9న తణుకులో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సేవల సంస్థ ఆధ్వర్యంలో తణుకు కోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులతోపాటు చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు.
GNTR: తెనాలిలో సోమవారం RTC డిపోలో RO వాటర్ ప్లాంట్‌ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం, వారి ఆరోగ్యం ప్రాధాన్యత ఇస్తూ.. మంచినీటి సౌకర్యం కల్పించామని తెలియజేశారు. జోనల్ ఛైర్మన్‌కు తెనాలి RTC డిపో మేనేజర్ రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు.