SKLM: జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎస్ .అన్నా జీ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా బిల్లు చాటున రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా డీలిమిటేషన్ అమలు చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు విఫలమవడం కేంద్రానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.
SKLM: జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎస్ .అన్నా జీ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా బిల్లు చాటున రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా డీలిమిటేషన్ అమలు చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు విఫలమవడం కేంద్రానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.
ASR: ఉపాధి కూలీలకు ఫేస్ హాజరు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జే.భగత్ రాం డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అరకు మండలం పద్మాపురం పంచాయితీ దుమ్ముగూడ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఫేస్ హాజరు వల్ల గిరిజన ప్రాంతంలో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల గిరిజనులు సక్రమంగా పని చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
SKLM: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (జాప్) జిల్లా ఉప అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ శనివారం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమ్మవారి పండుగలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నగర సుందరీకరణలో మీడియా పాత్ర ఎంతైనా ఉందని కమిషనర్ తెలిపారు.
ATP: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇవాళ కుందుర్పిలో ‘హెరిటేజ్ వాక్’ కార్యక్రమాన్ని పురావస్తు శాఖ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు బల్లేపల్లి మఠం నుంచి కుందుర్పమ్మ కోట వరకు ఈ యాత్ర సాగింది. పురాతన కట్టడాలు, శిలాశాసనాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు అన్నారు.
CTR: “సురక్షిత చిత్తూరు” కార్యక్రమంలో భాగంగా కుప్పం సబ్‌డివిజన్‌లో మహిళల భద్రత, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ బి. పార్థసారధి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు నేరాల నివారణ, మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
KKD: ఫ్లెక్సీ ఫ్రీ సీటీ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కాకినాడ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. నగరంలోని భానుగుడి నుంచి జగన్నాథపురం వరకు అనుమతిలేని ఫ్లెక్సీలు తొలగిస్తున్న కార్యక్రమాన్ని ఇవాళ పర్యవేక్షించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
KKD: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఇవాళ పెద్దాపురం మండలంలో పర్యటించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద “జలధార – జలహారతి” పథకం వి.తిమ్మాపురం గ్రామంలో అప్పలరాజు చెరువు, కొండపల్లి గ్రామంలో పాన్ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష జరిపారు.
KDP: స్వచ్ఛ గ్రామ లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ రథాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలాయపల్లె పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరుమామిళ్ల మండలం బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులకు స్వచ్ఛ రథం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాత సామాగ్రిని అందజేసి ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు పొందవచ్చని తెలిపారు.
ఏలూరు డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు సహజ సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళాను కలెక్టర్ వెట్రి సెల్వి ఇవాళ ప్రారంభించారు. సహజ సేంద్రియ ఉత్పత్తులను ప్రతి ఒక్కరు వినియోగించి ఆరోగ్యంవంతులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ పనులలో పాల్గొన్న మెర్ల సత్యనారాయణకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉపాధి సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉపాధి హామీ అధికారులు Ch. విజయ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ 1970- 71 విద్యార్థుల ఆత్మీయ కలయిక శనివారం జరిగింది. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేయడం, అవసరంలో ఉన్న పాత స్నేహితులకు ఆర్థిక సాయం అందించడం తదితర విషయాలపై చర్చించారు. గ్రాండ్ హనోటి హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 55 సంవత్సరాల తర్వాత పాత స్నేహితులు కలుసుకున్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అల్లి పీరాకు ఇవాళ సీఎం సహాయ నిధి కింద మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి రూ. 25వేల చెక్కును అందజేశారు. బాధితుడి చికిత్స ఖర్చులకు ఉపయోగించుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బోయ వెంకన్న, తాయన్న, రమేష్, చిన్న భీమేష్, శాంతప్ప, తదితరులు పాల్గొన్నారు.
CTR: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛత దివస్’ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయాల్లో పరిసరాలను శుభ్రపరచడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టి “క్లీన్ అండ్ గ్రీన్”కు ప్రాధాన్యం ఇచ్చారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.