• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న మంత్రి పర్యటన

AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

February 23, 2026 / 02:15 PM IST

అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి దీక్ష

ASR: డుంబ్రిగుడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష ఇవాళ చేపట్టనున్నారు. ఈ దీక్షకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:15 PM IST

ప్రజలకు అందుబాటులో నూనెలు..!

ELR: DCMS ఏలూరు నిత్యవసర సూపర్ మార్కెట్‌లో వేరుశనగ నూనె కిలో 300 పప్పునూనె (నువ్వులు) కిలో 370లకు లైవ్‌లో అందుబాటులో ఉందని డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. కావున ప్రజలందరూ నిత్యవసర సరుకులు, నూనెలు తక్కువ ధరకు లభించునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణ్ణంపల్లి సొసైటీ ఛైర్ పర్సన్ అక్కి శెట్టి సాయి సుధాకర్ పాల్గొన్నారు.

February 23, 2026 / 02:15 PM IST

‘అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి’

SKLM అంగన్వాడీల వేతనాల పెంపు, ఐసీడీఎస్‌‌కు బడ్జెట్ పెంపు కోరుతూ మార్చి 2న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:13 PM IST

‘పారిశుద్ధ్య కార్మికుల వినతి’

KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఇటీవల విధుల్లో చేరిన 12 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లను మూడు నెలలు గడిచినా ఆప్కాస్‌లో ఆన్లైన్ చేయలేదని AITUC నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే పేర్లు ఆన్ లైన్ చేసి, మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.

February 23, 2026 / 02:10 PM IST

ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్ మాండ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 23, 2026 / 02:08 PM IST

పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

ATP: MLA పరిటాల సునీత ఆదేశాలతో చిన్నంపల్లి పంచాయతీ అన్నే ఫెర్రర్ కాలనీలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కోచింగ్ సెంటర్ నందు చదువుతున్న వారికి మాజీ మండల కన్వీనర్ మారినేని లక్ష్మీనారాయణ తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 02:06 PM IST

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

KRNL: నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ పాల్గొన్నారు.

February 23, 2026 / 02:05 PM IST

రైతాంగ సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ATP: సింగనమల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 50% నిధులు కేటాయించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం చాలా దారుణం అన్నారు.

February 23, 2026 / 02:04 PM IST

విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు

కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెదపారుపూడి ఎస్‌ఐ ఆర్. శ్రీధర్ వానపాముల జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి టీమ్-2 సభ్యులతో కలిసి సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ని ఆశ్రయించాలని సూచించారు.

February 23, 2026 / 02:00 PM IST

అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు సందర్శించిన స్పీకర్, మంత్రి

GNTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సవిత సందర్శించారు. స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల చేనేత వస్త్రాలను పరిశీలించి, అమ్మకాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 23, 2026 / 02:00 PM IST

అసెంబ్లీని సందర్శించిన భట్టిప్రోలు విద్యార్థులు

BPT: భట్టిప్రోలు మండలం ఐలవరం, గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం అసెంబ్లీని సందర్శించారు. శాసనసభ పనితీరుపై అవగాహన కల్పించుకోవడానికి వచ్చిన విద్యార్థులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కలిసి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ పాత్ర, ప్రజా సమస్యల పరిష్కార విధానం గురించి ఆయన విద్యార్థులకు వివరించారు.

February 23, 2026 / 02:00 PM IST

గ్రహణం కారణంగా ఆలయం మూసివేత

NTR: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలులో స్వస్తిశ్రీ చంద్రమాన విరోధి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారం మార్చి 3న కేతు గ్రహ సంచార చంద్రగ్రహణం సా.3.19కు ప్రారంభమై, సా.5.03కు మధ్యకాలం, సా.6.46కు సమాప్తి చెందుతుంది. గ్రహణం కారణంగా ఉదయం 7.30 వరకు బాలభోగం, మహా నివేదనలు నిర్వహించి, తదుపరి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడతాయని తెలిపారు.

February 23, 2026 / 02:00 PM IST

పెద్దకడబూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

KRNL: పెద్దకడబూరులోని బీసీ, ఎస్సీ కాలనీల్లో MPP నిధులు రూ.15 లక్షలతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. MPP శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సుజాత కలిసి భూమి పూజ నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

February 23, 2026 / 01:55 PM IST

కంటి వైద్య శిబిరంతో గ్రామీణులకు మెరుగైన చూపు: ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు: కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఆశయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాంతా బయోటెక్నిక్స్‌ ఫౌండర్‌ వర ప్రసాద్‌రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయులని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టిపి గూడూరు మండలం ఇస్కపాలెంలో శాంత-వసంత ట్రస్తు, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

February 23, 2026 / 01:47 PM IST