• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యువకుడి వివాహానికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమారుడు రవి వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సోమవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు తోడ్పాటు అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 11:00 AM IST

డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

VSP: భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక-మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.

February 23, 2026 / 10:52 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 10:43 AM IST

కలుషిత నీటితో ఇబ్బందులు

KRNL: పెద్దకడబూరు LLC కాలువ పరిధి సళ్లమ్మ వంక సమీపంలో నీరు కలుషితమవుతోంది. కాలువలో ప్రవహిస్తున్న నీటిలో గుర్రపుడెక్కలు, చనిపోయిన జంతువుల కళేబరాలు పేరుకుపోయి తేలుతూ దుర్గంధం వెదజల్లుతోంది. పరిసర ప్రాంతమంతా అసహ్యకరమైన వాసనతో నిండిపోతోంది. చుట్టూ ప్రక్కల పొలాల కూలీలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు.

February 23, 2026 / 10:42 AM IST

దేవుడితో వైసీపీ నీచ రాజకీయం: ఎమ్మెల్యే

PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను వైసీపీ నేతలు గౌరవించలేదని ఆరోపించారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులు వేసుకుని నినాదాలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

February 23, 2026 / 10:41 AM IST

ఇంటర్ పరీక్షలను పరిశీలించిన ఎస్సై

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన నిఘా మధ్య జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నార్పలలోని పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని ఎస్సై సాగర్ పర్యవేక్షించారు.

February 23, 2026 / 10:40 AM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

AKP: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్ జరక్కుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసామన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత పేపర్లను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుస్తామన్నారు.

February 23, 2026 / 10:38 AM IST

శ్రీ విరుపాక్షి మారెమ్మకు విశేష పూజలు

CTR: పుంగనూరులో ప్రజలు ఆరాధించే శ్రీ విరుపాక్షి మారెమ్మకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, వెండి ఆభరణాలతో అలంకరించారు. భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు.

February 23, 2026 / 10:36 AM IST

రాయచోటిలో ముగిసిన పార్వేట ఉత్సవం

అన్నమయ్య: రాయచోటిలో శ్రీవీరభద్ర స్వామివారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. గతేడాది నిర్వహించిన ఉత్సవ సందర్భంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లిం, మైనారిటీలు స్వామివారి ఊరేగింపునకు ఆహ్వానం పలికి తాగునీరు అందజేశారు.

February 23, 2026 / 10:36 AM IST

అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

KRNL: ఆదోనిలోని అన్నా క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌ను చేరుకున్న ఆయన, అక్కడ అందుతున్నసేవలపై ఆరా తీశారు. అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అల్పాహారం చేస్తున్న సామాన్య ప్రజల వద్దకు వెళ్లి, ఆహారం రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు.

February 23, 2026 / 10:35 AM IST

సామర్లకోటలో పోలీస్ బందోబస్త్

KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో గల పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తులను చేపట్టినట్టు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 10:34 AM IST

విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ

AKP: పాములవాక జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సోమవారం జిల్లా అందత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. వారం రోజుల కిందట విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించారు. వారిలో అర్హులైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు సుజాత, భీమన్న, రామారావు తెలిపారు.

February 23, 2026 / 10:31 AM IST

నిరుపయోగంగా తనకల్లు బస్టాండు

సత్యసాయి: తనకల్లులో ఆర్టీసీ బస్టాండు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా మారింది. అధికారులు బస్సులను అంబేద్కర్ సర్కిల్ వద్ద నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు నీడ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక దుకాణాల ముందు నిలబడాల్సి వస్తోంది. మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్సులను బస్టాండు నుంచి నడపాలని స్థానికులు కోరుతున్నారు.

February 23, 2026 / 10:31 AM IST

నేడు రాజాంలో సందడి చేయనున్న జబర్దస్త్ టీం

VZM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో సోమవారం రాత్రి జబర్దస్త్ టీం సందడి చేయనున్నారు. జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, రేంజింగ్ రాజ్, శాంతి స్వరూప్, దొరబాబు, సౌమ్య రావు, తదితరులు తమ కామెడీతో అలరించనున్నారు. ఈవెంట్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు.

February 23, 2026 / 10:30 AM IST

ఎస్ ఎం పురంలో ఘనంగా ఎర్రం నాయుడు జయంతి వేడుకలు

SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ ఎం పురం గ్రామంలో దివంగత నేత, మాజీ మంత్రి కింజరావు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ధనలక్ష్మి, డీసీఎంఎస్ ఛైర్మన్ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 10:25 AM IST